SBI లోన్ తీసుకున్నారా.. అయితే మీకే ఈ స్వీటెస్ట్ వార్నింగ్!

by GSrikanth |
SBI లోన్ తీసుకున్నారా.. అయితే మీకే ఈ స్వీటెస్ట్ వార్నింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: లోన్లు తీసుకున్న వారిచేత తిరిగి కట్టించుకునేందుకు బ్యాంకులు ఎన్ని తిప్పలు పడుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిచేత వాయిదాలు కట్టించుకునేందుకు నానా కష్టాలు పడుతుంటారు. అయినా కొందరు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు చివరకు చేసేదేంలేక కడుతుంటారు. అయితే, ఈ వాయిదాలు చెల్లింపులపై ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. లోన్లు తీసుకున్న వారు సకాలంలో వాయిదాలు చెల్లించేలా వినూత్న కార్యక్రమం చేపట్టింది. నెలవారీ వాయిదాలు ఎగ్గొట్టే అవకాశం ఉన్న వారికి చాక్లెట్లు పంపి వాయిదాలు కట్టాలని గుర్తు చేయడానికి సిద్ధమైంది. ఇందుకోసం రెండు సంస్థలతో ఎస్‌బీఐ ఒప్పందం చేసుకుంది. ఏఐ సాయంతో వాయిదా సమీపిస్తున్న సమయంలో రుణ గ్రహీతలకు రిమైండర్లు పంపనుంది. 15 రోజులుగా ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ఇప్పటికే అమలు చేస్తోంది. అతి త్వరలో మిగతా చోట్ల కూడా ప్రారంభించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed