మరింత భారం కానున్న ఎస్‌బీఐ రుణాలు!

by Harish |
మరింత భారం కానున్న ఎస్‌బీఐ రుణాలు!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రుణాలు మరింత ప్రియం కానున్నాయి. గతవారం ఆర్‌బీఐ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్‌బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. సవరించిన రేట్లు తక్షణమే అమలవుతాయని బ్యాంకు స్పష్టం చేసింది.

బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం, వినియోగదారులు తీసుకునే వివిధ రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఇక, ఓవర్‌నైట్ ఎంసీఈల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 7.95 శాతానికి నెల రోజుల ఎంసీఎల్ఆర్ 8.10 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.10 శాతానికి, ఆరు నెలల కాలపరిమితిపై 8.40 శాతానికి, రెండేళ్లపై 8.60 శాతానికి, మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్‌ను 8.70 శాతానికి పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయించింది.

ఎంసీఎల్ఆర్ రేటు అనేది బ్యాంకు వినియోగదారులకు ఇచ్చే రుణాల కనీస రేటు. దీని పెంపు కారణంగా వినియోగదారులు తీసుకునే గృహ, వ్యక్తిగత, వాహన రుణాలపై వడ్డీ రేట్ల ప్రభావితం అవుతాయి.

Advertisement

Next Story

Most Viewed