రుణగ్రహితలకు SBI షాక్.. భారీగా పెరగనున్న EMIలు

by Harish |   ( Updated:2023-03-14 13:59:43.0  )
రుణగ్రహితలకు SBI షాక్.. భారీగా పెరగనున్న EMIలు
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన బేస్‌ రేట్‌, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లను పెంచింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, బీపీఎల్ఆర్ 70 బేసిస్ పాయింట్లను పెంచి 14.85 శాతానికి చేర్చింది. అలాగే, బేస్ రేటును కూడా 9.40 శాతం నుంచి 10.10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

దీంతో ఎస్‌బీఐ నుంచి రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా మొత్తాలు (ఈఎంఐ) పెరగనున్నాయి. బేస్‌ రేటు అనేది అన్ని రుణాలకు వర్తించే కనీస రేటు. అంతకంటే తక్కువకు రుణాలివ్వడానికి వీలుండదు. బీపీఎల్‌ఆర్‌ అనేది బేస్‌ రేటుకు ముందున్న రుణాలకు మాత్రమే వర్తించే రేటు. ఇదే సమయంలో ఎంసీఎల్‌ఆర్‌, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్), రెపో-లింక్డ్ లెండింగ్ రేట్(ఆర్ఎల్ఎల్ఆర్)లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

Also Read..

ఈ యాప్ ద్వారా మీ క్రెడిట్ కార్డు బిల్లు కడితే తిరిగి బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు

Advertisement

Next Story