క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో SBI కొత్త క్రెడిట్ కార్డు విడుదల

by Harish |   ( Updated:2022-09-02 12:23:04.0  )
క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో SBI కొత్త క్రెడిట్ కార్డు విడుదల
X

న్యూఢిల్లీ: భారత క్రెడిట్ కార్డు జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్ గురువారం తన కొత్త క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ప్రధానంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని 'క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్' పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఇలాంటి క్యాష్‌బ్యాక్‌ను అందించే కార్డును తీసుకురావడం పరిశ్రమలో ఇదే మొదటిదని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ కార్డును ఉపయోగించి వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఒక్కో లావాదేవీ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. అదే ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు, యుటిలిటీ బిల్లుల పేమెంట్స్‌కు 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుందని, ఇందులో మర్చంట్ లిమిట్(పరిమితి) అనేది లేదని సంస్థ వివరించింది. బిల్లింగ్ పూర్తయిన తర్వాత రెండు రోజులకు ఎస్‌బీఐ కార్డు ఖాతాలో క్యాష్‌బ్యాక్ వస్తుందని తెలిపింది. ప్రత్యేక ఆఫర్ కింద ఈ కార్డును మొదటి ఏడాదిలో ఉచితంగా ఇవ్వనున్నామని, 2023, మార్చి వరకు ఇది ఉచితంగానే అందించనున్నట్టు సంస్థ సీఈఓ, ఎండీ రామ్మోహన్ చెప్పారు.

సంస్థ తీసుకొచ్చిన కార్డు ద్వారా క్రెడిట్ కార్డు పోర్ట్‌ఫోలియో పటిష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్డును కావాలనుకునే వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎస్‌బీఐ కార్డు స్ప్రింట్ ద్వారా పొందడానికి వీలుంటుందని సంస్థ పేర్కొంది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కొత్త కార్డు ద్వారా వినియోగదారులు 2023, మార్చి వరకు కార్డును ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత కార్డు పునరుద్ధరణ కోసం ఏడాదికి రూ. 999 చెల్లించాలి.

అలాగే, ఏడాదిలో రూ. 2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు నిర్వహించే వారికి వార్షిక ఫీజు ఉండదు. పెట్రోల్ బంకుల వద్ద రూ. 500-3,000 మధ్య లావాదేవీలపై 1 శాతం ఫ్యుయెల్ సర్‌ఛార్జీ మినహాయింపు లభిస్తుంది.

అలర్ట్.. సెప్టెంబర్‌లో మారనున్న ఐదు కీలక ఆర్థిక అంశాలు

Advertisement

Next Story

Most Viewed