AI ఫీచర్లతో ACలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ ‌మెషీన్లను ఆవిష్కరించిన శామ్‌సంగ్

by Harish |   ( Updated:2024-04-03 14:38:29.0  )
AI ఫీచర్లతో ACలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ ‌మెషీన్లను ఆవిష్కరించిన శామ్‌సంగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ACలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ ‌మెషీన్లు, మైక్రోవేవ్ వంటి వాటిని ఆవిష్కరించింది. ఇప్పటికే గృహోపకరణాల్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో ఉత్పత్తులను లాంచ్ చేయడం ద్వారా మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకుంటుంది. AI వినియోగం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు, వాటిని సులభంగా నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ పరికరాల్లో ఇన్‌బిల్ట్‌ ఇంటర్నెట్ కనెక్టివిటీ, కెమెరా, ఏఐ చిప్‌ ఉంటాయి. స్మార్ట్‌థింగ్స్ అప్లికేషన్ ద్వారా గృహోపకరణాలను నియంత్రించవచ్చు. AI ద్వారా ఎయిర్‌ కండిషనర్‌ల్లో 20 శాతం, రిఫ్రిజిరేటర్‌లో 10 శాతం, వాషింగ్‌ మెషీన్‌లో 70 శాతం వరకు విద్యుత్‌ ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. ఇవన్నీ కూడా బిక్స్‌బీ ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed