జీవితకాల కనిష్టానికి రూపాయి విలువ పతనం!

by Dishaweb |
జీవితకాల కనిష్టానికి రూపాయి విలువ పతనం!
X

న్యూఢిల్లీ: భారత కరెన్సీ రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్ఠానికి చేరింది. శుక్రవారం అమెరికా డాలరుతో రూపాయి మారకం జీవితకాలం పతనం రూ. 83.17కి క్షీణించింది. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపాయి విలువ రూ. 83కి పడిపోవడం అసాధారణమేమీ కాదని చెప్పుకొచ్చింది. కరెన్సీ విలువ దెబ్బతినడం ఒక్క రూపాయికి మాత్రమే పరిమితం కాలేదని, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తీసుకునే చర్యల కారణంగా కూడా కరెన్సీ విలువలో ఒడిదుడుకులకు కారణమని ఆర్థిక శాఖ అధికారి అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ పడిపోవడం మూలంగా దిగుమతులపై ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ముడి చమురు, ఎరువుల దిగుమతులు ఎక్కువగా పొందే భారత్‌పై ఈ ఒత్తిడి అధికంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల ద్రవ్యోల్బణ ఆందోళన మరింత పెరగవచ్చని వెల్లడించారు. అయితే, కరెన్సీ మారకం విలువ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed