- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి గ్రాండ్‌గా చేసుకోగానే సరిపోదు.. అంబానీ ఫ్యామిలీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన RTI కార్యకర్త!
దిశ, ఫీచర్స్: ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నా అంబానీ పెళ్లి ముచ్చట్లే వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. ప్రముఖ వ్యాపార వేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ వివాహం జూలై 12 న అంగరంగ వైభవంగా ముంబైలోనిజియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలకు దేశ, విదేశాల చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు.. టాలీవుడ్, బాలీవుడ్‌తో సహా ఇతర ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా హాజరై సందడి చేశారు.
దీంతో ప్రజెంట్ అందరి దృష్టి ఈ పెళ్లిపైనే పడింది. అంతే కాకుండా.. దాదాపుగా వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ వేడుకలకు ఎంత వరకు ఖర్చు అయుంటుందని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఈ పెళ్లి వేడుకలకు అనంత్ అంబానీ రూ. 5వేల కోట్లు ఖర్చు చేశారని సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. దీంతో RTI కార్యకర్త అనిల్ గల్గాలీ కీలక విషయాలు వెల్లడించారు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న స్థలానికి సంబంధించి ముకేశ్ కుటుంబం MMRDA (Mumbai Metropolitan Region Development Authoroty) కి రూ. 4,381 కోట్లు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. అలాగే పెళ్లిని ఘనంగా చేసుకోవడాన్ని తాను తప్పు పట్టట్లేదని, బకాయిలు కూడా చెల్లించాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రజెంట్ ఆయన కామెంట్స్ నెట్టిం వైరల్‌గా మారాయి.