- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
GST: 18,000 బోగస్ కంపెనీలను గుర్తించిన జీఎస్టీ అధికారులు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా నకిలీ రిజిస్ట్రేషన్లతో వేలాది కంపెనీలు జీఎస్టీని ఎగవేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు జీఎస్టీ కింద నమోదైన దాదాపు 18,000 నకిలీ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలన్నీ దాదాపు రూ. 25,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. నకిలీ కంపెనీలకు వ్యతిరేకంగా జీఎస్టీ అధికారులు దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 73 వేల కంపెనీలు వస్తువుల విక్రయం లేకుండా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) పొందడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు మోసం చేసేందుకు ఏర్పాటు చేశారని తేలింది. కంపెనీలు మొత్తం రూ. 24,550 కోట్లను ఎగొట్టారని ఓ అధికారి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం వల్ల కంపెనీలు సుమారు రూ.70 కోట్ల వరకు స్వచ్ఛందంగా జీఎస్టీని చెల్లించాయి. నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి తనిఖీ చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన భౌతిక ధృవీకరణలను కోరుతోంది. గతేడాది మే-ఆగస్టు మధ్య తొలి విడత తనిఖీల్లో దేశవ్యాప్తంగా రూ.30,843 కోట్ల విలువైన నకిలీ ఇన్‌వాయిస్‌లను అధికారులు గుర్తించారురు. ఆ తర్వాత రెండో విడత ఆగష్టు-అక్టోబర్ మధ్య జరగ్గా రూ. 24,010 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్టు పేర్కొన్నారు.