- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఒక గేమ్‌ఛేంజర్: ఎస్‌బీఐ ఛైర్మన్
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన రూఫ్‌టాప్ సోలార్ కార్యక్రమం 'గేమ్‌ఛేంజర్' గా ఉండనుందని, దీన్ని ఇళ్ల రుణాల విభాగంలో ఒక అవకాశంగా భావిస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఛైర్మన్ దినేష్ ఖారా అన్నారు. బుధవారం ముంబైలోని ఇండియా మార్ట్‌గేజ్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇప్పటికే తాము సోలార్ ఎనర్జీ, రూఫ్‌టాప్ సోలార్‌ను ప్రోత్సహించేందుకు వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తున్నాము. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్యక్రమం మరొక అవకాశంగా చూస్తున్నామని ఖారా పేర్కొన్నారు. 'ఈ పథకం ప్రకటించినప్పుడు నిజంగా ఇదొక గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని అనిపిచింది. ఎందుకంటే ప్రతి ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఈ ప్రోగ్రామ్ మార్చగలదు. ఉత్పత్తి అయిన దాంట్లో వినియోగం తర్వాత మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కి పంపడం జరుగుతుంది. కాబట్టి దేశంలో విద్యుత్ కొరత లాంటి సమస్యలకు ఇదొక అద్భుతమైన పరిష్కారం కాగలదని నమ్ముతున్నట్టు' దినేష్ ఖారా వివరించారు. కాగా, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూఫ్‌టాప్ సోలార్ కార్యక్రమం కింద కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పొందేందుకు కేంద్రం వీలు కల్పిస్తుందని తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ కార్యక్రమం వల్ల రూ.18,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా.