- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జియో ఫైనాన్షియల్ షేర్ల లిస్టింగ్ తేదీ ప్రకటించిన రిలయన్స్!
ముంబై: దేశీయ దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఆగష్టు 21 నుంచి కంపెనీ షేర్లు మార్కెట్లో లిస్ట్ అవుతాయని రిలయన్స్ సంస్థ శుక్రవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇటీవల రిలయన్స్ సంస్థ తన ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్‌ను విభజించింది. గతవారం అర్హత ఉన్న రిలయన్స్ ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో కంపెనీ షేర్లను కేటాయించింది. విభజనలో భాగంగా రిలయన్స్ ఒక షేర్ ఉన్న ప్రతి వాటాదారుకు ఒక జియో ఫైనాన్షియల్ షేర్ జమ చేశారు. జూలైలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ ద్వారా సంస్థ షేర్ విలువను రూ. 261.85గా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.66 లక్షల కోట్లతో దేశంలోనే రెండవ అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థగా అవతరించింది.