- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్'లో రిలయన్స్ అధినేత అగ్రస్థానం
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాదికి సంబంధించి 'బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్'లో దేశీయ అతిపెద్ద సంపన్నుడు ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా రెండోస్థానం సాధించారు. ప్రముఖ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అంతర్జాతీయంగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌లను అధిగమించి రెండో ర్యాంక్‌కు చేరారు. టెన్సెంట్ సీఈఓ మా హుంటెంగ్ గ్లోబల్ ర్యాంకింగ్‌లో మొదటిస్థానంలో ఉన్నారు. ఇక, దేశీయ దిగ్గజ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశెఖరన్ 5వ స్థానంలో ఉన్నారు. గతేడాది ఈ జాబితాలో ఆయన ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన అనీష్ షా ఆరో స్థానంలో, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ 16వ ర్యాంకు సాధించారు. ఇటీవల బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన గ్లోబల్ 500-2024 జాబితాలో రిలయన్స్‌కు చెందిన టెలికాం కంపెనీ జియో భారత బలమైన బ్రాండ్‌గా అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ర్యాంకింగ్స్‌లోనూ జియో బలమైన బ్రాండ్‌గా మొదటి స్థానాన్ని సాధించింది.
Read More..
సవాళ్లను ఎదుర్కోవడంలో యువత సామర్థ్యం ఆశ్చర్యం కలిగిస్తోంది: సీజేఐ