- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shaktikanta Das: ద్రవ్యోల్బణం, వృద్ధి సమతుల్యత అత్యంత కీలకం

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్‌గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించిన శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ క్రమంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన కీలక అంశాలపై సంభాషించారు. ప్రధానంగా ఆర్‌బీఐ ఎదుట ఉన్న సవాళ్ల గురించి, కొత్తగా బాధ్యతలు తీసుకోబోయే సంజయ్ మల్హోత్రా గురించి మాట్లాడారు. 'ద్రవ్యోల్బణం-వృద్ధి సమతుల్యతను పునరుద్ధరించడం అతి ముఖ్యమైన పని. కొత్త గవర్నర్ నేతృత్వంలోని ఆర్‌బీఐ టీమ్ దీన్ని ముందుకు తీసుకెళ్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను' అని దాస్ అన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మల్హోత్రాను ప్రస్తావిస్తూ.. దశాబ్దాల అనుభవం ఉన్న మల్హోత్రా సీబీడీసీ, యూఎల్ఐ లాంటి ఆర్‌బీఐ కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగించగలరనే విశ్వాసం ఉంది. సైబర్ సెక్యూరిటీ ప్రధాన సమస్యగా మారుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు కొత్త టెక్నాలజీ వాడకాన్ని పెంచాలి. గత నాలుగేళ్లలోనే వేగంగా కూరగాయల ధరలు పెరిగింది. తద్వారా అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠానికి చేరింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, వృద్ధి సమతుల్యతను కాపాడాలని దాస్ సూచించారు.
ఈ సందర్భంగా ఎక్స్‌లో ట్వీట్ చేసిన దాస్, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం, ఆర్‌బీఐ టీమ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఇదే చివరిరోజు. ఇప్పటివరకు తనకు మద్దతుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. ఆర్‌బీఐ గవర్నర్‌గా దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. ఆయన మార్గదర్శకంలో లభించిన ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మనసపూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. గడిచిన ఆరేళ్ల కాలంలో ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందని దాస్ ట్వీట్ చేశారు. ఈ సమయంలో అసాధారణమైన విజయాలను సాధించినట్టు పేర్కొన్నారు.