- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPO: స్టాక్ మార్కెట్ సెన్సేషన్‌గా నిలిచిన రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీఓ
దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లలో అనేక కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులను సమీకరిస్తుంటాయి. వాటిలో కొన్ని కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరుస్తాయి, మరికొన్ని భారీ లాభాలను తెచ్చిపెడతాయి. తాజాగా ఓ కంపెనీ భారీగా సబ్‌స్క్రైబ్ కావడమే కాకుండా వ్యాపార నిర్వహణ వివరాల్లో అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీకి చెందిన ఈ కంపెనీ ఎవరికీ పెద్దగా తెలియకపోవడం విశేషం. తక్కువ ప్రచారంలో ఉండి అనూహ్యంగా స్టాక్ మార్కెట్ సెన్సేషన్‌గా నిలిచిన ఆ కంపెనీయే రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్. స్మాల్ మీడియా ఎంటర్‌ప్రైజ్(ఎస్ఎంఈ) విభాగంలో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ కేవలం రూ. 12 కోట్ల నిధుల సమీకరణకు మాత్రమే సిద్ధమైంది. కానీ, పెట్టుబడిదారులను ఆకట్టుకుని 419 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇన్వెస్టర్ల నుంచి రూ. 4,800 కోట్ల విలువైన బిడ్లు కంపెనీకి వచ్చాయి. ఈ కంపెనీకి కేవలం రెండు షోరూమ్‌లు, 8 మంది మాత్రమే ఉద్యోగులు ఉండటం గమనార్హం. 2018లో ప్రారంభమైన ఈ కంపెనీ సాహ్నీ ఆటోమొబైల్ బ్రాండ్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. యమహా బ్రాండ్ డీలర్‌షిప్‌ను కలిగిన కంపెనీ మోటార్‌సైకిల్, స్కూటర్ల అమ్మకాలు, సేవలను అందిస్తోంది. కొత్తగా మరో రెండు షూరూమ్‌ల ఏర్పాటు, అప్పులు, నిర్వహణ ఖర్చుల కోసం ఐపీఓ నిధులను వినియోగించనున్నట్టు పేర్కొంది.