- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెపోరేటు 35 బేసిస్ పాయింట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దిశ, వెబ్‌డెస్క్: అంతా అనుకున్నట్లుగానే రెపోరేటు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపోరేటు 6.25 శాతానికి చేరింది. ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి సమావేశాలకు సంబంధించిన నిర్ణయాలను ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. ఈ సమావేశాల్లో రాబోయే 12 నెలల్లో ద్రవ్యోల్బణం 4 శాతానికి మించి ఉంటుందని అంచనా వేశారు. అలాగే, ఆర్థిక సంవత్సరం 2023 కోసం GDP వృద్ధి అంచనా 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు.
ఈ పెంపుదలతో రుణాలు మరింత భారం కానున్నాయి. ఇప్పటివరకు ఈ ఏడాది 225 పాయింట్లకు పైగా ఆర్‌బిఐ రెపోరేటును పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికి భారత్ మాత్రం పటిష్టమైన స్థితిలో ఉందని శక్తికాంత దాస్ అన్నారు. కేంద్ర బ్యాంక్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ద్రవ్యోల్బణం అక్టోబర్-డిసెంబర్ 2022లో 6.6 శాతం, జనవరి-మార్చి 2023లో 5.9 శాతం, ఏప్రిల్-జూన్ 2023లో 5.0 శాతం, జులై-సెప్టెంబర్ 2023లో 5.4 శాతంగా ఉంటుందని కేంద్ర బ్యాంకు అంచనా వేసింది.