- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్‌లో జియో ఫైనాన్సియల్ లిస్టింగ్!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో లిస్టింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిలయన్స్ సంస్థ తన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జేఎఫ్ఎస్)ను వేరు చేసి లిస్టింగ్ సంస్థగా మారుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని జేఎఫ్ఎస్ లిస్టింగ్ కోసం అవసరమైన అనుమతులు పొందేందుకు దేశీయ నియంత్రణ సంస్థలతో చర్చలు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది.
ఈ ఏడాది మార్చి నెలలో రిలయన్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్న దాని ప్రకారం, జేఎఫ్ఎస్‌ను లిస్టింగ్ చేసేందుకు మే 2న మాతృసంస్థ వాటాదారులు, క్రెడిటర్స్‌తో సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని తెలుస్తోంది. కాగా, రిలయన్స్ సంస్థ గత నవంబర్‌లో జియో ఫైనాన్సియల్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కె వి కామత్‌ను నియమించిన సంగతి తెలిసిందే.