- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30 నిమిషాల డెలివరీ సేవలు ప్రారంభించనున్న రిలయన్స్ రిటైల్
దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ కంపెనీ త్వరలో క్విక్-కామర్స్ సేవలను తిరిగి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా కేవలం 10 నిమిషాల్లో ఉత్పత్తులను డెలివరీ అందిస్తున్న బ్లింక్ఇట్, జెప్టోల తరహాలో సేవలందించనుంది. అయితే, వాటికి పోటీగా కాకుండా రిలయన్స్ 30 నిమిషాల్లో ఉత్పత్తులను కస్టమర్లకు చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. గతేడాది తొలిసారిగా రిలయన్స్ రిటైల్ 'జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్' పేరుతో క్విక్-కామర్స్ సేవలను నవీ ముంబైలో ప్రారంభించింది. అయితే, ఆ సమయంలో లాభదాయకంగా లేదనే కారణంతో విస్తరణ చేపట్టలేదు. తాజాగా రిలయన్స్ సొంత స్టోర్లు, దాదాపు 20 లక్షల కిరాణాలతో భాగస్వామ్యం నేపథ్యంలో తిరిగి క్విక్-కామర్స్ సేవలందించాలని చూస్తోంది. 30 నిమిషాల్లో డెలివరీల్లో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. తొలుత రిలయన్స్ రిటైల్ కిరాణా సామగ్రిని డెలివరీ చేయనుంది. 19,000 కంటే ఎక్కువ స్టొర్ నెట్‌వర్క్ ద్వారా దుస్తులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను అరగంటలో డెలివరీ చేయాలని జియోమార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ వరగంటి పేర్కొన్నారు.