- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Income Tax Act: ఆదాయపు పన్ను చట్టం 1961పై సీనియర్ అధికారులతో నిర్మలా సీతారామన్ భేటీ
దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆదాయపు పన్ను చట్టం 1961పై సమగ్ర సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్, ఇతర సీనియర్ సీబీడీటీ అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామ ఆదాయపు పన్ను చట్టాన్ని సమీక్షిస్తామని చెప్పారు. చట్టాన్ని మరింత సులభంగా, స్పష్టంగా అర్థం చేసుకునేందుకు, చదివేందుకు ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్టు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల పన్ను వివాదాలు, వ్యాజ్యాలు తగ్గుతాయి. తద్వారా పన్ను చెల్లింపుదారులకు పన్ను చెల్లింపుల్లో స్పష్టత పెరుగుతుందన్నారు. 'ఆదాయ పన్ను చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్‌కమిటీలను ఏర్పాటు చేసినట్టు రెవెన్యూ కార్యదర్శి ఆర్థిక మంత్రికి చెప్పారు. ఈ కమిటీలు వ్యక్తిగతంగా, ఇతర మార్గాల్లో అనేక సమావేశాలను నిర్వహిస్తున్నాయి. చట్టాన్ని మెరుగుపరిచేందుకు తగిన సూచనలు సిఫార్సు చేస్తాయని' ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేయడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం నుంచి 6,500 విలువైన సూచనలు అందుకున్నట్టు రెవెన్యూ కార్యదర్శి వెల్లడించారు.