ఈ ధనత్రయోదశికి రికార్డు స్థాయిలో బైక్‌లు, కార్ల విక్రయాలు

by Harish |   ( Updated:2022-10-22 14:41:53.0  )
ఈ ధనత్రయోదశికి రికార్డు స్థాయిలో బైక్‌లు, కార్ల విక్రయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి సందర్బంగా జరుపుకునే ధనత్రయోదశి(ధన్తేరస్)కి బైక్‌లు, కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతాయని ఆటోమొబైల్ డీలర్లు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత కొనగోళ్లు పూర్తిస్థాయిలో పుంజుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్లో రిటైల్ విక్రయాల్లో కనీసం 40 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఎడిఎ) ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు.

పట్టణ, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుండి వస్తున్న బలమైన డిమాండ్‌తో ద్విచక్ర వాహన విభాగంలో అమ్మకాలు పెరిగాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కస్టమర్ల నుండి 7-8 లక్షల యూనిట్ల బుకింగ్‌‌లు వచ్చాయి. ఈ పండగ టైంలో దాదాపు 2 లక్షల వాహనాల యూనిట్లు రిటైల్ అవుతాయని FADA అంచనా వేస్తున్నట్టు సింఘానియా తెలిపారు.

దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్‌లో 11 శాతం పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు ఏడాది క్రితం తో పోలిస్తే గత నెలలో 92 శాతం పెరిగి 3,07,389 యూనిట్లకు చేరుకున్నాయి.

ఇవి కూడా చదవండి :

పెరుగుతున్న పెట్రోల్ డీజీల్ ధరలకు ప్రత్యమ్నాయమేది?

Advertisement

Next Story

Most Viewed