గ్రామాల్లో డిజిటల్ చెల్లింపులు పెంచేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక కార్యక్రమం!

by Harish |
గ్రామాల్లో డిజిటల్ చెల్లింపులు పెంచేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక కార్యక్రమం!
X

ముంబై: గత కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఇప్పటికీ జనాభాలో గణనీయమైన భాగం రోజువారీ లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడలేదు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) 'హర్ పేమెంట్ డిజిటల్ ' పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులు చేసే లక్ష్యంతో దీన్ని ప్రారంభించామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం ప్రకటనలో చెప్పారు.

అందులో భాగంగా స్థానిక వ్యాపారుల్లో అవగాహన పెంచేందుకు దేశంలోని 75 గ్రామాల్లో డిజిటల్ చెల్లింపులకు అవసరమైన సహాయం అందించే చర్యలు తీసుకుంటామని దాస్ తెలిపారు. దీనికోసం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్(పీఎస్ఓ)లు దేశంలోని 75 గ్రామాలను ఎంపిక చేసుకుని '75 డిజిటల్ విలేజెస్ ప్రోగ్రామ్' కింద డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు పనిచేస్తారు. గ్రామాల్లోని వ్యాపారుల కోసం పీఎస్ఓలు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారన్నారు.

ఇటీవల సింగపూర్, భారత్ మధ్య మొదలైన యూపీఐ లావాదేవీల తర్వాత అనేక దేశాలు యూపీఐ చెల్లింపుల కోసం ఆసక్తి చూపిస్తున్నాయని, త్వరలో కనీసం అరడజను దేశాలు భారత్‌తో యూపీఐ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభిస్తాయని భావిస్తున్నామని దాస్ పేర్కొన్నారు.

Advertisement

Next Story