- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ!
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ ఏడాదిలో తన స్వంత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని దశల వారీగా విడుదల చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొదట దీన్ని టోకు వ్యాపారాలు ఉపయోగించేందుకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. సీబీడీసీ యూజర్లు వినియోగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా దీన్ని రూపిందిస్తున్నారు.
మొదట్లో టోకు వ్యాపారాలలో పరిశీలించిన తర్వాత మాత్రమే డిజిటల్ కరెన్సీని రిటైల్ విభాగంలో ఆర్‌బీఐ ప్రారంభించనుంది. ఈ ఏడాదిలోగా హోల్‌సేల్ విభాగంలో ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీని విడుదల చేయాలని భావిస్తున్నాం. దీని ద్వారా అన్ని లావాదేవీలను ట్రాక్ చేసేందుకు వీలవుతుందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీబీడీసీని ఈ ఏడాదిలోగా ఆర్‌బీఐ ప్రారంభిస్తుందని చెప్పారు. సీబీడీసీ ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం లభిస్తుంది. దీన్ని మరింత సమర్థవంతమైన, చౌకైన కరెన్సీ నిర్వహణ వ్యవస్థను రూపొందించవచ్చు. అందుకోసమే బ్లాక్‌చెయిన్, ఇతర టెక్నాలజీలను ఉపయోగించి డిజిటల్ రూపాయి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి అప్పటి ప్రకటనలో వెల్లడించారు.