RBI: యూకో బ్యాంక్‌పై రూ. 2.68 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ

by S Gopi |
RBI: యూకో బ్యాంక్‌పై రూ. 2.68 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ యూకో బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. కరెంట్ ఖాతాలు తెరవడం, డిపాజిట్లపై వడ్డీ రేటు, ఇతర కారణాలతో సహా నిబంధనలను ఉల్లంఘించినందుకు యూకో బ్యాంకుపై రూ. 2.68 కోట్ల జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా నో యువర్ కస్టమర్(కేవైసీ) ఆదేశాల్లోని కొన్ని నిబంధనలను పాటించని కారణంగా సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్‌పై కూడా రూ. 2.1 లక్షల పెనాల్టీ విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. రెండు సంస్థలపై విధించిన జరిమానా నియంత్రణ నిబంధనలపై ఆధారపడి తీసుకున్న నిర్ణయాలేనని, ఇరు సంస్థలు తమ కస్టమర్లతో ఉన్న లావాదేవీలను ఉద్దేశించినవి కాని పేర్కొంది.

Advertisement

Next Story