- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ. 1.27 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ
by S Gopi |
X
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. కేవైసీ(నో యువర్ కస్టమర్) సహా ఇతర నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బీఓఎంపై రూ. 1.27 కోట్ల పెనాల్టీ విధిస్తూ ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. బీఓఎం బ్యాంకు క్రెడిట్ కార్డుల డెలివరీతో పాటు సెక్యూరిటీ, కేవైసీలకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఆర్‌బీఐ తన ఆర్డర్‌లో పేర్కొంది. బీఓఎంతో పాటు మరో రెండు బ్యాంకులపై కూడా సెంట్రల్ బ్యాంక్ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటిలో హిందుజా లేల్యాండ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు కేవైసీ ఆదేశాలు ఉల్లంఘించిన కారణంగా రూ.4.90 లక్షలు, రుణాలపై వడ్డీని వసూలు చేయడంలో నిబంధనలు పాటించకపోవడంతో పూనావాలా ఫిన్‌కార్ప్‌కు రూ. 10 లక్షలు పెనాల్టీ విధించింది.
Advertisement
Next Story