RBI Governor: వరుసగా రెండో ఏట టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

by S Gopi |
RBI Governor: వరుసగా రెండో ఏట టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అరుదైన ఘనతను సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్త టాప్ సెంట్రల్ బ్యాంకర్‌ అవార్డును దాస్ వరుసగా రెండో ఏడాది పొందినట్టు ప్రకటించింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2024 ప్రకారం, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 2వ సంవత్సరం ఏ+ రేటింగ్ దక్కించుకున్నారని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఏ+ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ల జాబితాలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో ఉన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణలో విజయం సాధించడం వంటి అంశాల్లో దాస్ ఉత్తమ ర్యాంకును పొందారు. ఏ+ ర్యాంకింగ్‌లో దాస్‌తో పాటు డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్‌సెన్, స్విట్జర్లాండ్‌కు చెందిన థామస్ జోర్డాన్ నిలిచారు. సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ ర్యాంకును 1994 నుంచి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed