- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
కొచ్చి: ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించి కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. బ్యాంకులు ప్రతి లావాదేవీల పట్ల శ్రద్ధ వహించాలని, ఫెయిల్డ్ ట్రాన్సక్షన్స్, సైబర్ మోసాలు మొదలగు వాటి గురించి వచ్చే ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని త్వరతగిన విధంగా పరిష్కరించాలని కొచ్చిలో జరిగిన పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ (PSO) కాన్ఫరెన్స్‌లో శక్తికాంత దాస్ అన్నారు. అలాగే, కస్టమర్లు సంతృప్తి చెందే విధంగా ప్రతి ఫిర్యాదును పరిష్కరించడంపై అధికారులు దృష్టి పెట్టి, చెల్లింపులను సులభంగా జరిగేలా చూడాలని అన్నారు.
అలాగే, డిజిటల్ చెల్లింపుల గురించి మాట్లాడుతూ, దేశంలో దాదాపు 114 కోట్ల మొబైల్ ఫోన్ కనెక్షన్‌లు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్‌ల వాడకం క్రమంగా పెరుగుతుంది. ఇంటర్నెట్ సేవలు విరివిగా లభ్యం కావడం వలన డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నట్లు తెలిపారు. జనవరి 2023లో రూ. 51 లక్షల కోట్ల విలువైన 1,050 కోట్ల రిటైల్ డిజిటల్ చెల్లింపు లావాదేవీలు ప్రాసెస్ అయ్యాయని ఆయన అన్నారు.
2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ప్రారంభించడం ద్వారా 2023 జనవరిలోనే 13 లక్షల కోట్ల రూపాయల విలువైన 803 కోట్ల లావాదేవీల ద్వారా విప్లవాత్మక మార్పు వచ్చింది. విదేశాలకు కూడా డిజిటల్ చెల్లింపులను విస్తరించినట్లు దాస్ తెలిపారు.
Also Read..
క్రెడిట్ సూయిజ్‌ను కాపాడటానికి స్విస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు