- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రెడిట్ కార్డుల జారీ, వినియోగానికి ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు
దిశ, బిజినెస్ బ్యూరో: క్రెడిట్ కార్డుల జారీ విషయంలో అధీకృత కార్డు నెట్‌వర్క్‌లతో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థల భాగస్వామ్యంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బుధవారం మార్గదర్శకాలను జారీ చేసింది. కార్డు నెట్‌వర్క్‌లు, కార్డు జారీ చేసే బ్యాంకుల మధ్య ఉన్న ఏర్పాట్లు వినియోగదారులకు అనుకూలంగా లేవని గుర్తించిన ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డ్‌ల జారీలో కస్టమర్‌లకు ఎంపిక, సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో మార్గదర్శకాలు రూపొందించినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. కార్డు జారీ చేసే బ్యాంకులు నెట్‌వర్క్ ఎంపికను నిర్ణయిస్తాయి. క్రెడిట్ కార్డుల జారీకి సంబంధించి కార్డు నెట్‌వర్క్‌లు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలకు సహకరిస్తాయి. కార్డు జారీ చేసే బ్యాంకులు ఇతర కార్డు నెట్‌వర్క్ సేవలను పొందకుండా నివారించేలా కార్డు నెట్‌వర్క్‌లతో ఎలాంటి ఏర్పాటు లేదా ఒప్పందం చేసుకోకూడదు.
అలాగే, బ్యాంకులు తమ అర్హత కలిగిన వినియోగదారులకు కార్డు ఇష్యూ చేసే సమయంలో కార్డు నెట్‌వర్క్‌లను ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలి. ఇప్పటికే కార్డు ఉన్న వారికి సైతం రెన్యూవల్ సమయంలో ఈ ఆప్షన్ వర్తిస్తుంది. ఈ ఆదేశాలు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్, మాస్టర్ కార్డ్ ఆసియా/పసిఫిక్, ఎన్‌పీసీఐ-రూపే, వీసా వరల్డ్‌వైడ్ వంటి కార్డు నెట్‌వర్క్‌లకు వర్తిస్తాయి. అయితే, 10 లక్షల కంటే తక్కువ యాక్టివ్ కార్డులు ఉన్న క్రెడిట్ కార్డు జారీ సంస్థలకు ఈ ఆదేశాలు వర్తించవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అలాగే, సొంత అధీకృత కార్డు నెట్‌వర్క్‌లో క్రెడిట్ కార్డులను జారీ చేసే బ్యాంకులు సంస్థలు కూడా ఈ మార్గదర్శకాల నుంచి మినహాయించబడ్డారు.