- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండేళ్లలో ఏటీఎమ్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయనున్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్!
![రెండేళ్లలో ఏటీఎమ్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయనున్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్! రెండేళ్లలో ఏటీఎమ్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయనున్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్!](https://www.dishadaily.com/h-upload/2023/08/15/249024-punjab-and-sindh-bank.webp)
ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వచ్చే రెండేళ్లలో తన ఏటీఎమ్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. బ్యాంకు టచ్ పాయింట్లతో పాటు బ్రాండ్‌ను పెంచేందుకు ఏటీఎమ్ నెట్‌వర్క్‌ను 1,600కు పెంచనుంది.
అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 50 బ్రాంచులను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్టు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వరూప్ కుమార్ సాహా చెప్పారు. కొత్త బ్రాంచులను అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా డిపాజిట్ల వృద్ధికి అవకాశం ఉంటుందని, రుణాలు కూడా పెరిగేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ఖర్చు తగ్గించుకుంటూనే, ఆదాయం పెంచే సామర్థ్యాన్ని మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నాం. దానికోసం ఏటీఎం నెట్‌వర్క్‌ను పెంచడం, డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా సాధించగలమని స్వరూప్ వివరించారు. బ్యాంకు తన కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ని అప్‌గ్రేడ్ ప్రక్రియ ద్వారా డిజిటల్ సేవలను పెంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు పేర్కొన్నారు.