- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరానందానీ గ్రూప్ ప్రమోటర్లకు ఈడీ సమన్లు
దిశ, బిజినెస్ బ్యూరో: విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ హీరానందానీ గ్రూప్ ప్రమోటర్లు నిరంజన్ హీరానందానీ, అతని కుమారుడు దర్శన్ హీరానందానీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 26న ప్రశ్నించడానికి దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి రావాలని కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫెమా నిబంధనల ప్రకారం గత వారం ముంబై, పరిసర హిరానందానీ గ్రూప్‌నకు చెందిన నాలుగు ప్రాంగణాలను ఈడీ సోదా చేసిన సంగతి తెలిసిందే. దర్శన్ హీరానందని గత కొన్నేళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఈ-మెయిల్ ద్వారా అతనికి అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం. ఆఫ్ షోర్ ట్రస్ట్ ద్వారా వీరి కుటుంబం 60 మిలియన్ డాలర్ల మేర లబ్ధిని పొందినట్లు తెలుస్తోంది. 2006-2008 మధ్య కాలంలో హిరానందానీలు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో కనీసం 25 కంపెనీలను, ట్రస్ట్‌ను స్థాపించారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్న కంపెనీ విదేశీ పెట్టుబడుల్లో రూ.400 కోట్లకు పైగా మళ్లించినట్లు ఈడీ పేర్కొంది.