- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థిరాస్తి రంగంలో సగానికి పడిపోయిన ప్రైవేట్ పెట్టుబడులు
ముంబై: దేశీయ స్థిరాస్తి రంగంలో ప్రైవేటు పెట్టుబడులు దాదాపు సగానికి పడిపోయాయని కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ రెండో వారం నాటికి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు 44 శాతం క్షీణించాయి.
అంతర్జాతీయ మదుపర్లు భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇప్పటివరకు 3.02 బిలియన్ డాలర్ల(రూ. 25 వేల కోట్ల) పెట్టుబడులు వచ్చాయి. గతేడాది ఇదే సమయంలో 5.3 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 45 వేల కోట్ల) విలువైన పెట్టుబడులు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, అమెరికా సహా వివిధ సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీ రేట్ల విషయంలో అనుసరిస్తున్న ధోరణి పెట్టుబడుల కార్యకలాపాలపై ప్రభావం చూపాయని, అందుకే ప్రధాన స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు నెమ్మదించాయని నైట్‌ఫ్రాంక్ వివరించింది.
డేటా ప్రకారం, సమీక్షించిన కాలంలో సింగపూర్ నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయి. ఈ దేశం నుంచి భారత స్థిరాస్తి రంగంలోకి పెట్టుబడులు 50 శాతం పెరిగాయి. ఇక, ఎక్కువ భాగం పెట్టుబడులు కార్యాలయాల్లోకి(58 శాతం) రాగా, ఆ తర్వాత వేర్‌హౌసింగ్(23 శాతం), గృహాలు(19 శాతం) వచ్చాయి. ఈ ఏడాది రిటైల్ రంగంలో ఎటువంటి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు రాకపోవడం గమనార్హం.