- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2-19 శాతం తగ్గనున్న సబ్బులు, డిటర్జెంట్ల ధరలు
ముంబై: దేశీయ అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 2-19 శాతం తగ్గించినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా ముడిసరుకు ధరలు గణనీయంగా పెరగడంతో కంపెనీ దాని ఉత్పత్తుల ధరలను పెంచింది. ప్రస్తుతం ముడిసరుకు ధరలు తగ్గడంతో తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది. కొత్త ధరలు కలిగిన స్టాక్ నెల చివరన మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
కొత్త ధరల ప్రకారం, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 500-మి.లీ రూ. 115 నుంచి రూ. 112 కు తగ్గనుంది. రిన్ డిటర్జెంట్ పౌడర్ 1-కిలోల ప్యాక్ రూ. 103 నుంచి రూ. 99 కి తగ్గుతుంది. డోవ్ సోప్ 50 గ్రాములు రూ. 27 నుంచి రూ. 22కు, 125 గ్రాముల నాలుగు ప్యాక్‌లు కలిగిన లైఫ్‌బోయ్ సబ్బు రూ. 140 నుంచి రూ. 132 కి తగ్గించారు. అదే విధంగా, నాలుగు లక్స్ సబ్బుల ప్యాక్ రూ. 140 లను ఐదు ప్యాక్‌గా మార్చి రూ. 156 విక్రయించనున్నారు. ధరల తగ్గింపు విషయాన్ని కంపెనీ తన డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేసింది. సబ్బుల విభాగంలో హెచ్యుఎల్తో పోటీ పడుతున్న గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (GCPL) గత నెలలో ఎంపిక చేసిన ప్రొడక్ట్‌ల ధరలు తగ్గించింది.