Prices Hike: మధ్య తరగతి ప్రజలకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే నిత్యావసర ధరలు పెంపు..!

by Maddikunta Saikiran |
Prices Hike: మధ్య తరగతి ప్రజలకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే నిత్యావసర ధరలు పెంపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌(India)లో నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్‌ఎంసిజి కంపెనీలు(FMCG Companies) మరోసారి బిస్కెట్లు, నూనె, షాంపులు, సబ్బులు వంటి ధరలను పెంచేందుకు రెడీ అయ్యాయి. ముడిపదార్థాల ఖర్చులు పెరగడం, ఆహార ద్రవ్యోల్బణం కారణంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్‌ఎంసిజి కంపెనీల లాభాలు తగ్గాయి. దీంతో పాటు పామాయిల్, కాఫీ వంటి ధరలు పెరగడంతో తమ ప్రొడక్ట్స్ రేట్స్(Products Rates)ను త్వరలోనే పెంచుతామని కొన్ని ఎఫ్‌ఎంసిజి సంస్థలు తెలిపాయి. పట్టణ ప్రాంతాల్లో హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్(HUL), గోద్రెజ్(Godrej), మారికో(Marico), ఐటీసీ(ITC), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(TCPL) వంటి దిగ్గజ కంపెనీల వస్తువుల వినియోగం తగ్గడంపై పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా ప్రముఖ కంపెనీల విక్రయాల్లో పట్టణాల వాటాయే 65-68 శాతం ఉంటోంది. అలాగే సెప్టెంబరు త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసిజి సంస్థల విక్రయాలు గణంగా పెరిగాయి. రెండో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసిజి కంపెనీలు స్వల్ప నష్టాలను చవిచూశాయని, ఉత్పత్తుల ధరలను పెంచి ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా లాభాలను పెంచుకుంటామని గోద్రెజ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ(Godrej MD&CEO) సుధీర్ సీతాపతి(Sudhir Sitapati) పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed