EMIలో రూ.525కే పవర్ ఫుల్ మిస్ట్ కూలర్ ఫ్యాన్.. బ్యాటరీతో 48 గంటలు రన్

by sudharani |   ( Updated:2023-06-02 12:25:02.0  )
EMIలో రూ.525కే పవర్ ఫుల్ మిస్ట్ కూలర్ ఫ్యాన్.. బ్యాటరీతో 48 గంటలు రన్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ టైంలో చాలా మంది ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కొంటుంటారు. అయితే ఇప్పటికే కొన్ని రకాల ఫ్యాన్లు, కూలర్లు కొని అవి సరిగా పని చేయక.. గాలి చల్లగా రాక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. మార్కెట్‌లోకి కొత్త పవర్ ఫుల్ ఫ్యాన్ వచ్చేసింది. మరి దాని ధర, డిస్కౌంట్, ఫీచర్స్ మొదలైన విషయాలు తెలుసుకుందాం..

ఇది కూనీ కంపెనీ తయారు చేసిన పొగమంచు ఫ్యాన్. ఇది ఫుల్ రీఛార్జబుల్ ఫ్యాన్. దీని బ్యాటరీ పవర్ 10000mAh కలిగి ఉంది. దీంతో కరెంట్ లేకపోయినా.. లో స్పీడ్‌లో 48 గంటలు, మీడియం స్పీడ్‌లో 12 గంటలు, హైస్పీడ్‌లో 6 గంటలు పనిచేస్తుందని అంటున్నారు. అంతే కాదు దీని బ్యాటరీని మార్చుకునేందుకు వీలుగా, డిటాచబుల్‌గా తయారుచేశారు. ఈ ఫ్యాన్‌కి లో, మీడియం, హైస్పీడ్ మోడ్స్ ఉన్నాయి. ఈ ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో పనిచేస్తున్నప్పుడు కొంత శబ్దం వస్తుంది. అది 50 డెసిబుల్స్ ఉంటుందని తెలిపారు.

ఈ ఫ్యాన్‌కి కూల్ వాటర్ పోసుకునేందుకు వాటర్ ట్యాంక్ ఉంది. ఇందులో 200ml నీటిని పోసుకోవచ్చని తెలిపారు. ఈ ఫ్యాన్ నుంచి వచ్చే పొగమంచు.. 2 స్పీడ్ మోడ్స్‌లో వస్తుందని తెలిపారు. ఒక మోడ్‌లో కంటిన్యూగా వస్తుంది. మరో మోడ్‌లో అప్పుడప్పుడూ వస్తుంది. కంటిన్యూగా వస్తే మిస్ట్ (పొగమంచు) 1 గంట.. అప్పుడప్పుడు వస్తే 2 గంటలు వస్తుందని తెలిపారు.

ఈ ఫ్యాన్ అసలు ధర రూ.17,543 ఉండగా.. అమెజాన్‌లో దీనిపై 37 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.10,978కి అమ్ముతున్నారు. EMIలో రూ.525కే పొందే వీలుంది. కాగా.. ఈ ఫ్యాన్‌కి భారీ క్లిప్ ఉండటంతో ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ అడ్డంగా, నిలువుగా 360 డిగ్రీస్‌లో తిరగగలదు. అందువల్ల ఎటు కావాలంటే అటు గాలి వచ్చేలా చేసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఆమెజాన్ ప్రైమ్‌లో తెలుసుకోవచ్చు. కావాలంటే కొనుక్కోండి.. వద్దు అనుకునే వాళ్లు లైట్ తీసుకోండి.

Also Read..

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా హెడ్‌ పునీత్ రాజీనామా!

Advertisement

Next Story