Post Office RD Scheme: పోస్టాఫీస్‌లో బెస్ట్ సేవింగ్స్ స్కీమ్.. నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ల టెన్యూర్‌ తర్వాత ఎంతొస్తుంది..?

by Maddikunta Saikiran |
Post Office RD Scheme: పోస్టాఫీస్‌లో బెస్ట్ సేవింగ్స్ స్కీమ్.. నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ల టెన్యూర్‌ తర్వాత ఎంతొస్తుంది..?
X

దిశ, వెబ్‌డెస్క్: మీరు నెల నెల కొద్ది మొత్తంలో డబ్బును పొదుపు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. కష్టపడి సంపాదించినా డబ్బును ఎంతో కొంత పొదుపు చేయాలనుకునే వారికి పోస్టాఫీసు(Post Office)ల్లో చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్(Recurring Deposit Scheme). సింగిల్ అకౌంట్(Single Account) కింద ఒకరు, జాయింట్ అకౌంట్(Joint Account) కింద గరిష్టంగా ముగ్గురు ఈ స్కీంలో చేరొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుండి 5 సంవత్సరాల టైం లిమిట్ ఉంటుంది. అవసరమైతే మరో 5 సంవత్సరాలకు పొడిగించవచ్చు. దీంట్లో ప్రతి నెల మీరు కంపల్సరీ మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఏ కారణంతో అయినా డబ్బును చెల్లించకుంటే జరిమానా విధిస్తారు. వరుసగా నాలుగు నెలలు ఇన్వెస్ట్ చేయకుంటే స్కీమ్ ఆటోమేటిక్‌గా క్యాన్సల్ అవుతుంది.

అయితే కేవలం నెలకు రూ.100తో ఈ స్కీమ్‌లో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంత డబ్బయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం డిపాజిట్ లిమిట్‌ లేదు. కాగా దీంట్లో ఇంట్రెస్ట్‌ రేటు ప్రస్తుతం ఏడాదికి 6.7 శాతంగా ఉంది. ప్రతి మూడు నెలలకు వడ్డీని లెక్కిస్తారు. పోస్టాఫీస్ రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే ఐదు సంవత్సరాల తర్వాత ఎంత ఆదాయం వస్తుందో చూద్దాం. ఉదాహరణకు మీరు నెలకు రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత మీకు అసలు, వడ్డీ కలుపుకొని మీ చేతికి రూ. 35,681వస్తాయి. రూ. 1000 పెడితే రూ.71,817, రూ. 2000 పెట్టుబడి పెడితే మీ చేతికి దాదాపు రూ.1,42,732 అందుతాయి. ఈ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర్లోని పోస్టాఫీస్‌ను సందర్శించి అవసరమైన డాక్యుమెంట్ లను సబ్మిట్ చేసి పెట్టుబడి ప్రారంభించవచ్చు.

Advertisement

Next Story