ఐదు రెట్లు పెరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభాలు!

by Harish |
ఐదు రెట్లు పెరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభాలు!
X

ముంబై: ప్రభుత్వ రంగ పంజాన్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి నికర లాభాలు ఐదు రెట్లు పెరిగాయని శుక్రవారం ప్రకటించింది. తక్కువ మొండి బకాయిలు, వడ్డీ ఆదాయం పెరగడం వంటి సానుకూల పరిణామాలతో 2022-23 చివరి త్రైమాసికంలో బ్యాంకు లాభాలు రూ. 1,159 కోట్లకు చేరుకుందని బ్యాంకు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 202 కోట్ల లాభాలను ఆర్జించింది.

అలాగే, సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం గతేడాది రూ. 21,095 కోట్ల నుంచి రూ. 27,269 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. వడ్డీ ఆదాయం రూ. 18,645 కోట్ల నుంచి రూ. 23,849 కోట్లకు చేరుకుంది. ఇక, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఒక్కో షేర్‌కు రూ. 0.65 లేదా 32.5 శాతం డివిడెండ్‌ను బ్యాంకు బోర్డు సిఫార్సు చేసింది. బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 2022, మార్చి నాటికి 11.78 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 8.74 శాతానికి తగ్గాయని బ్యాంకు పేర్కొంది.

Advertisement

Next Story