- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ విమానయాన మార్కెట్‌కు కొత్త శక్తిగా భారత్: ప్రధాని మోడీ
దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న గిరాకీతో దేశంలోని విమానయాన సంస్థల నుండి కొత్త విమానాల ఆర్డర్‌లు భారీగా పెరిగాయి. దీంతో భారత్ ఇప్పుడు ప్రపంచ విమానయాన మార్కెట్‌కు కొత్త శక్తిని అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం కర్ణాటకలోని బెంగళూరు పర్యటనలో భాగంగా దేవనహళ్లిలో బోయింగ్ ఇండియా, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో మోడీ పైవ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఉన్న భారత్‌లో వచ్చే దశాబ్ద కాలంలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. ఇదే సమయంలో ఈ రంగంలో మహిళల పాత్ర గురించి ప్రస్తావించిన మోడీ, ప్రస్తుతం దేశంలో 15 శాతం మంది పైలట్లు మహిళలే ఉన్నారు. ఇది ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) విద్యకు భారత్ హబ్‌గా మారిందని వెల్లడించారు. మహిళలు మరింత అభివృద్ధి చెందాల్సిన సమయం ఆసన్నమైందని మోడీ అన్నారు. కాగా, బోయింగ్ ఇండియా దేవనహళ్లిలో నిర్మించిన క్యాంపస్‌కు రూ. 1,600 కోట్లు వెచ్చించింది. ఇందులో దేశీయంగా అంతరిక్ష, వాణిజ్య, రక్షణ రంగాలకు కావాల్సిన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ సెంటర్‌లో సుమారు 5,000 మంది వరకు ఉపాధి పొందనున్నారు.