2023, నవంబర్ నాటికి పీఎల్ఐ పథకం కింద రూ. లక్ష కోట్ల పెట్టుబడులు

by S Gopi |
2023, నవంబర్ నాటికి పీఎల్ఐ పథకం కింద రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం తెచ్చిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద 2023, నవంబర్ నాటికి రూ. 1.03 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటివరకు రూ. 4,415 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను కేంద్రం పంపిణీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని రుణాలు అందజేస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 11,000 కోట్ల లక్ష్యం పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు, నాలుగు పీఎల్ఐ పథకాలు మెరుగైన స్పందను పొందాయి. ఇతర రంగాల్లోనూ ఇదే ధోరణి ఉంటుందని ఆశిస్తున్నట్టు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్ అన్నారు. మొత్తం 14 రంగాల్లో భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల రంగాల్లో స్పందన బాగుంది. ఆయా రంగాల్లో లక్ష్యాలు దాదాపు పూర్తయ్యాయి. అయితే, కొన్ని రంగాల్లో ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాజీవ్ సింగ్ వెల్లడించారు.

Advertisement

Next Story