మరింత దూకుడుగా వ్యాపార విస్తరణ: పిజ్జా హట్!

by Vinod kumar |
మరింత దూకుడుగా వ్యాపార విస్తరణ: పిజ్జా హట్!
X

న్యూఢిల్లీ: గడిచిన రెండేళ్లలో దేశీయంగా తమ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేశామని, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో ఉనికిని విస్తరించే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్టు ప్రముఖ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చెయిన్ పిజ్జా హట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పెరిగిన కొనుగోలు శక్తి కారణంగా కొత్త జనరేషన్ వినియోగదారులు, మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని విస్తరణ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్టు పిజ్జా హట్ ఇండియా ఎండీ మెరిల్ పెరీరా అన్నారు.

విస్తరణలో భాగంగా తాము ప్రధానంగా టైర్2, టైర్3 నగరాలపై దృష్టి సారిస్తామని, ఇప్పటికే ఈ నగరాల్లో తమ మొత్తం వ్యాపారంలో 50 శాతం వాటా ఉన్నప్పటికీ, సామర్థ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని మెరిల్ తెలిపారు. గత రెండేళ్లలో భారత మార్కెట్లో స్టోర్లను 417 నుంచి 820కి పెంచాం. దీన్ని మరింత పెంచే విధంగా ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు.

Advertisement

Next Story