భారీగా కుప్పకూలిన పేటీఎం షేర్లు

by M.Rajitha |
భారీగా కుప్పకూలిన పేటీఎం షేర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రముఖ ఆర్థిక లావాదేవీల సేవల సంస్థ పేటీఎం షేర్లు సోమవారం భారీగా కుప్పకూలి పోయాయి. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వర్మకు ఈరోజు సెబీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు రాగా.. ఆ వెంటనే పేటీఎం మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు భారీగా పడిపోయాయి. ఒకానొక దశలో పేటీఎం షేర్లు రూ.505.25 వరకు పడిపోవడం స్టాక్ మార్కెట్లో కలకలం రేపింది. కాగా 2021 లో పేటీఎం షేరు ధర రూ.2150 ఉండగా.. 2024 లో పేటీఎం బ్యాంక్ మీద ఆర్బీఐ చర్యల అనంతరం షేరు ధర రూ.310 కి పడిపోయింది. ఆ తర్వాత కొంత కోలుకుంటున్నట్టు అనిపిస్తుండగా.. నేడు పేటీఎం కి మరో ఝలక్ తగిలింది.

Next Story

Most Viewed