Bigg Boss 8: అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తే ఇంటి బయట ఉంటావ్.. మణికంఠకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

by Prasanna |   ( Updated:2024-09-22 04:08:20.0  )
Bigg Boss 8: అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తే ఇంటి బయట ఉంటావ్.. మణికంఠకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఏడు సీజన్లు వియవంతంగా పూర్తి చేసుకుని ఎనిమదవ సీజన్ కి ఇటీవలే ప్రారంభమైంది. షో మొదలవ్వక ముందు వరకు టాక్ ఒకలా ఉంటుంది.. ఒక్కసారి మొదలయ్యాక టాక్ మొత్తం బయట మారిపోతుంది.ఇక ఈ సీజన్లో ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా వాడుకుని మణికంఠ జనాల్లోకి వెళ్ళిపోయాడు. అయితే, ఇప్పుడు ఇతని ప్రవర్తన చూసి అందరూ తిట్టుకుంటున్నారు. తాజాగా, నాగార్జున వీడియో చూపించి మరి మణికంఠకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇటీవల మణికంఠ, యష్మిని హగ్ చేసుకుని చాలా ఓవర్ చేసాడు.. నాకు ఇష్టం లేదు ..వద్దని చెప్పినా వినడం లేదంటూ బిగ్ బాస్ కి చెప్పుకుంటూ యష్మి ఏడ్చింది. ఆమెనే కాకుండా మిగతా లేడి కంటెస్టెంట్స్ ని హగ్ చేసుకుని వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ విషయంలో నాగార్జున మణికంఠపై ఫైర్ అయ్యాడు.

మణికంఠని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి.. యష్మి ఏడుస్తున్న వీడియోని ప్లే చేసి చూపించారు. ఏ ఆడపిల్ల అయినా నీ వల్ల ఇంకోసారి బాధ పడితే ఇంటి బయట ఉంటావ్ జాగ్రత్త .. నువ్వు బిగ్ బాస్ కు ఎందుకొచ్చావో అది గుర్తుంచుకొని ఆడు. తనే కాదు .. వేరే వాళ్ళతో ఇలా తప్పుగా బిహేవ్ చేస్తున్నావు అంటూ బాగా వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.

Advertisement

Next Story

Most Viewed