పేటీఎం స్వతంత్ర డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన మంజు అగర్వాల్

by S Gopi |
పేటీఎం స్వతంత్ర డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన మంజు అగర్వాల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కష్టాల్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ బాధ్యతలకు మంజు అగర్వాల్ రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా దీని గురించి కథనాలు వచ్చిన నేపథ్యంలో సోమవారం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన వ్యక్తిగత కారణాలతో మంజు అగర్వాల్ సంస్థను వీడినట్టు ధృవీకరించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆంక్షల కారణంగానే ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మంజు అగర్వాల్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ కంపెనీ కార్యకలాపాలు, వ్యాపారంపై ఎలాంటి ప్రభావం ఉండదని పేటీఎం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, ప్రస్తుత ప్రతికూల పరిణామాల మధ్య నియంత్రణాపరమైన విషయాలు, నిబంధనలను అమలు చేసేందుకు పేటీఎం ఓ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కమిటీలో ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు ఎం ఎం చితలె, ఆర్‌బీఐ ఎంపిక చేసిన బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డు గవర్నింగ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు ఉంటాడని వెల్లడించింది. బ్యాంకింగ్ నిపుణులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed