తక్కువ అమౌంట్‌కు పిన్ అవసరం లేకుండా Phonepeలో UPI లైట్ ఫీచర్

by Harish |
తక్కువ అమౌంట్‌కు పిన్ అవసరం లేకుండా Phonepeలో UPI లైట్ ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే కొత్తగా వినియోగదారుల కోసం ఒక సదుపాయాన్ని తీసుకొచ్చింది. డిజిటల్ చెల్లింపులు రూ. 200 లోపు ఉన్నప్పడు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి యూపీఐ లైట్(UPI Lite)అనే కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్‌పే యాప్‌లోనే యూపీఐ లైట్ ఉంటుంది. దీనిలో ముందుగానే రూ. 2000 వరకు మనీ యాడ్ చేసుకోవచ్చు. చెల్లింపుల సమయంలో యూపీఐ లైట్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. దీనిలో చిన్న పేమెంట్స్ రూ. 200 వరకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇది అన్ని ప్రధాన బ్యాంకులకు సపోర్ట్ చేస్తుంది.

Advertisement

Next Story