Passanger Vehicles: డీలర్ల వద్ద భారీ సంఖ్యలో అమ్ముడుపోని ప్యాసింజర్ వాహనాలు: ఫాడా

by S Gopi |
Passanger Vehicles: డీలర్ల వద్ద భారీ సంఖ్యలో అమ్ముడుపోని ప్యాసింజర్ వాహనాలు: ఫాడా
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని నెలలుగా దేశీయ వాహన పరిశ్రమలో అమ్మకాలు తగ్గాయి. దీనివల్ల కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఇన్వెంటరీలతో ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వివరాల ప్రకారం, ప్యాసింజర్ వాహనాల(పీవీ) అమ్మకాలు క్షీణించడంతో దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద రూ. 73 వేల విలువైన 7 లక్షల వాహనాలు మిగిలిపోయాయి. జూలై నెల ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్ ప్రసుతం 70.75 రోజులకు పెరిగాయి. దీనివల్ల డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇన్వెంటరీల సంఖ్యను తగ్గించేందుకు వాహన తయారీ కంపెనీలు పరిష్కార మార్గాలను అన్వేషించాలని, ఉత్పత్తిని తగ్గించి, రిటైల్ అమ్మకాలకు తగిన స్థాయిలో చేపట్టాలని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ చెప్పారు. సాధారణంగా డీలర్ల వద్ద వెయిటింగ్ పీరియడ్ సగటున 30 రోజులు ఉండాలి. ప్రస్తుతం దీనికి రెట్టింపు ఉంది. రానున్న నెలల్లో పండుగ సీజన్ ద్వారా అమ్మకాలు పెంచి ఇన్వెస్టరీలను తగ్గించినప్పటికీ డీలర్లపై ఒత్తిడి ఉంటుందని ఆయన వివరించారు. కాగా, జూలై నెలకు సంబంధించి ప్యాసింజర్ వాహనాలు 10 శాతం వృద్ధితో 3.20 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే గతేడాది జూలై కంటే 2.5 శాతం విక్రయాలు క్షీణించాయని ఫాడా పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed