Sahara Group: సహారా ఇన్వెస్టర్లకు ఇప్పటివరకు రీఫండ్ చేసిన మొత్తం రూ.138 కోట్లే

by S Gopi |
Sahara Group: సహారా ఇన్వెస్టర్లకు ఇప్పటివరకు రీఫండ్ చేసిన మొత్తం రూ.138 కోట్లే
X

దిశ, బిజినెస్ బ్యూరో: సహారా గ్రూప్ వ్యవహారంలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటివరకు రూ. 138.07 కోట్లు మాత్రమే రీఫండ్ చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇప్పటివరకు 19,650 క్లెయిమ్‌లు వచ్చాయని, వాటిలో అర్హత ప్రమాణాల ఆధారంగా 17,256 క్లెయిమ్‌లను స్వీకరించవచ్చని, వాటి విలువ రూ. 138.07 కోట్లని పేర్కొన్నారు. ప్రజలకు చేరువయ్యేలా ప్రకటనల ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని ఆర్థిక మంత్రి అన్నారు. 3.07 కోట్ల మంది పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ. 25,781.37 కోట్లు రావాల్సి ఉందని అంచనా. ఆ పెట్టుబడిదారులకు 15 శాతం వడ్డీతో తమ డబ్బును వాపసు చేయాలని సహారా కంపెనీలను సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. '2013లో, మళ్లీ 2014, 2018లలో సెబీ ప్రకటనలు చేసినప్పటికీ ఫలితం కనిపించడంలేదు. ప్రజలు వచ్చి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేలా చేయడం వలన రీఫండ్ ప్రక్రియ జరుగుతుంది' అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed