మరో 100 మందిని తొలగించిన ఎడ్‌టెక్ స్టార్టప్ క్యూమ్యాథ్!

by Vinod kumar |
మరో 100 మందిని తొలగించిన ఎడ్‌టెక్ స్టార్టప్ క్యూమ్యాథ్!
X

బెంగళూరు: ప్రముఖ ఆన్‌లైన్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ 'క్యూమ్యాథ్' మరోసారి లేఆఫ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య కంపెనీ తాజాగా 100 మంది ఉద్యోగులను తొలగించిందని మనీకంట్రోల్ పేర్కొంది. మూలధన నిధుల లభ్యత బలహీనంగా ఉండటం, రాబడి, వ్యయం అంచనాలు భిన్నంగా ఉండటం, ముఖ్యంగా దేశంలోని ఎడ్‌టెక్ రంగంలో నెలకొన్న సంక్లిష్ట సమస్యల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని క్యూమ్యాథ్ వ్యవస్థాపకుడు, సీఈఓ మనన్ ఖుర్మ ఇటీవల ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో చెప్పినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే మరిన్ని ఉద్యోగాలను తగ్గించాల్సి వచ్చిందని మనన్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ స్థాయిలో పరిశ్రమలో పరిస్థితుల ఒత్తిడి కారణంగా ఈ ఏడాది మే నెలలో కంపెనీ కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కంపెనీ మరోసారి లేఆఫ్ నిర్ణయం తీసుకోదని చెప్పాను. అయితే, పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. భవిష్యత్తులో కంపెనీ సవాళ్లను అధిగమించేందుకు కొత్తగా తొలగింపుల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మనన్ ఖుర్మా ఉద్యోగులకు వివరించారు.

Advertisement

Next Story