4 ఏళ్ల పెట్టుబడితో కోటి రూపాయలు మీ సొంతం..

by Harish |   ( Updated:2023-04-05 11:40:52.0  )
4 ఏళ్ల పెట్టుబడితో కోటి రూపాయలు మీ సొంతం..
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకుల కంటే ఎక్కువ రాబడి అందించాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకొచ్చింది. దాని పేరు ‘జీవన్ శిరోమణి ప్లాన్’. ఈ పాలసీ ద్వారా వినియోగదారులు భారీ మొత్తంలో రాబడి సంపాదించవచ్చు. ఇది నాలుగు కాల పరిమితులను కలిగి ఉంటుంది. పాలసీదారుల గరిష్ట వయస్సు 55 ఏళ్లు, కనీస వయస్సు 18 ఏళ్లుగా ఉంది. 14,16,18,20 సంవత్సరాల ప్రాతిపదికన హమీ మొత్తం ఒక కోటి రూపాయలు గా ఉంది.

మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం అందుతుంది. 55 సంవత్సరాలు గల వారికి పాలసీ వ్యవధి 14 సంవత్సరాలుగా, 51 సంవత్సరాలు గల వారికి పాలసీ వ్యవధి 16 సంవత్సరాలుగా, 48 సంవత్సరాలు గల వారికి పాలసీ వ్యవధి 18 సంవత్సరాలుగా, 45 సంవత్సరాలు గల వారికి పాలసీ వ్యవధి 20 సంవత్సరాలుగా ఉంటుంది.

ఈ పాలసీలో నాలుగు సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ తరువాత రాబడి వస్తుంది. ప్రతి నెలా దాదాపు రూ. 94,000 పెట్టుబడి పెట్టాలి. రాబడిని నిర్ణీత వ్యవధిలో కూడా పొందవచ్చు. లేదంటే మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి కూడా తీసుకోవచ్చు. వినియోగదారుల అనారోగ్య పరిస్థితుల కాలంలో ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుంది. ఆదాయం ఎక్కువ గల వారికి ఈ పాలసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అధిక మొత్తంలో లాభం అందించే ఈ పాలసీ గురించి తెలుసుకోవడానికి దగ్గరలోని LIC బ్రాంచ్ లో సంప్రదించగలరు.

Read more:

Post Office స్కీమ్స్‌‌లలో కొత్త వడ్డీ రేట్ల పూర్తి లిస్ట్ ఇదే!

Advertisement

Next Story