- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈవీ స్కూటర్ ధరలు తగ్గించిన ఓలా.. రూ. 69,999కే ఎస్1ఎక్స్
దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజం ఈవీ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన్ ఎంట్రీ లెవల్ స్కూటర్ మోడళ్లు ఎస్1 ఎక్స్ సిరీస్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈవీ మార్కెట్లో వాటా పటిష్టం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇకమీదట ఓలా స్కూటర్ల ప్రారంభ ధర రూ. 69,999(ఎక్స్ షోరూమ్) నుంచే లభించనున్నాయి. దీనికి సంబంధించి కొత్త ధరల వివరాలను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. మొదటిసారి ఈవీలను కొనాలని భావించే వినియోగదారుల కోసం తమ ఈవీ స్కూటర్ ధరలను తగ్గించామని, తద్వారా మార్కెట్ వాటా పెంచుకునే వీలవుతుందని కంపెనీ పేర్కొంది. కొత్త ధరల స్కూటర్లు వచ్చే వారం డెలివరీ అవుతాయని కంపెనీ వెల్లడించింది. కొత్త ఎస్1 ఎక్స్ మూడు బ్యాటరీ వేరియంట్లతో అందుబాటులో ఉండగా, సవరించిన ధరలను పరిశీలిస్తే.. 2కిలోవాట్ అవర్ రూ.79,999 నుంచి రూ.69,999కి తగ్గించింది. 3 కిలోవాట్ అవర్ వేరియంట్ రూ. 89,999 నుంచి రూ. 84,999కి, 4కిలోవాట్ అవర్ ధర రూ. 1,09,999 నుంచి ఇప్పుడు రూ. 99,999కి లభిస్తుంది. ఈ మూడింటికి 8 ఏళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల బ్యాటరీ వేరియంట్‌తో వస్తాయని కంపెనీ వివరించింది. ఎస్1ఎక్స్ స్కూటర్లు కేవలమ 3.3 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. క్రూజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, ఓలా ఎలక్ట్రిక్ యాప్‌తో కనెక్టివిటీతో వస్తాయి.