- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీరో డౌన్ పేమెంట్‌తో అతి తక్కువ వడ్డీ రేటుకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్
బెంగళూరు: దేశీయ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులకు మరింత చేరువ కావడానికి జీరో డౌన్ పేమెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన S10 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తుంది. జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% అతి తక్కువ వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ఇంటికి తీసుకువెళ్లవచ్చు. IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్ సహకారంతో ఓలా ఈ సదుపాయాన్ని అందిస్తుంది. సాధారణంగా పలు కంపెనీలు 48 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్‌ను అందిస్తాయి. కానీ ఓలా అత్యధికంగా 60 నెలల వరకు ఆఫర్ చేస్తుంది. దీంతో మిగతా ఎలక్ట్రిక్ కంపెనీలకు పోటీ ఇవ్వనుంది.
ప్రస్తుతం ఓలా 700 కు పైగా అనుభవ కేంద్రాలను కలిగి ఉంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 1000వ రిటైల్ అవుట్‌లెట్ మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రముఖ ఫైనాన్సింగ్ కంపెనీల భాగస్వామ్యంతో, టైర్ 1, 2, 3 నగరాల్లో మంచి లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందిస్తున్నామని అన్నారు.
Read more: సీఎన్‌జీ వాహనాలు కొనాలనుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి ?