రూ. 1.09 లక్షలతో ఓలా కొత్త స్కూటర్

by S Gopi |
రూ. 1.09 లక్షలతో ఓలా కొత్త స్కూటర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనల తయారీ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే ఎస్1 ఎక్స్ వేరియంట్లో 4కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో దీన్ని తీసుకొచ్చింది. సింగిల్ ఛార్జ్‌తో 190 కిలోమీటర్ల ప్రయాణించగలిగే ఈ స్కూటర్ ధరను రూ. 1.09 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. 6కిలోవాట్ అవర్ మోటార్ అమర్చిన స్కూటర్ కేవలం 3.3 సెకన్లలో 0-40 కిలోమీటర్ల స్పీడ్‌ని అందుకోవడంతో పాటు గరిష్ట వేగం 90 కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది. లిక్విడ్ సిల్వర్, రెడ్ వెలాసిటీ, మిడ్‌నైట్, వోగ్, స్టీలర్, పోర్స్‌లెయిన్ వైట్, ఫంక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డెలివరీలను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. ఇక, బ్యాటరీకి సంబంధించి వినియోగారులు సంతృప్తి కలిగిస్తూ కొత్త వారెంటీ సదుపాయాన్ని ఓలా తెచ్చింది. 8 సంవత్సరాలు, లేదంటే 80 వేల కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారెంటీని ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ సదుపాయం అన్ని వాహనాలకు వర్తిస్తుంది. అవసరం అనుకుంటే కిలోమీటర్లను 1.25 లక్షల వరకు పెంచుకునే అవకాశం ఇస్తున్నట్టు ఓలా స్పష్టం చేసింది. ఇక, దేశంలో సర్వీస్ సెంటర్లను ఏప్రిల్ నాటికి 414 నుంచి 600కి పెంచుతామని పేర్కొంది. కొత్త ఆర్థిక సంవత్సరం నాటికి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను 10,000 పాయింట్లకు పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్టు వెల్లడించింది.

Advertisement

Next Story