బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

by Harish |   ( Updated:2023-05-28 12:10:00.0  )
బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
X

కృష్ణగిరి: ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా తమిళనాడులోని కృష్ణగిరిలో కొత్తగా బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్‌ నిర్మాణాన్ని ప్రారంభించినట్టు పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ సెల్‌ను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది సంవత్సరానికి 10 గిగావాట్-అవర్ ఉత్పత్తి సామర్థ్యంతో అత్యంత అధునాతనమైన, అతిపెద్ద సెల్ తయారీ సంస్థగా నిలుస్తుందని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.

రాబోయే ఓలా ప్లాంట్ ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) కోసం బ్యాటరీ సెల్స్‌తో పాటు ఇతర బ్యాటరీ అవసరాలను ఇది తీరుస్తుందని, భారతదేశానికి స్వంత బ్యాటరీ సెల్ తయారీ సౌకర్యం లేదు. స్థానికంగా ఉత్పత్తి చేసే బ్యాటరీ సెల్స్ ద్వారా భారత్ ప్రపంచ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అదే విధంగా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా పెరుగుతాయని ఆయన తెలిపారు.

ప్రభుత్వం కూడా దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహిస్తోంది. దీని కోసం ఇప్పటికే PLI పథకం కింద ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్‌తో పాటు, రిలయన్స్ కూడా దేశంలో బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story