IPO కు సిద్ధమవుతున్న ఓలా ఎలక్ట్రిక్!

by Harish |   ( Updated:2023-05-25 15:01:12.0  )
IPO కు సిద్ధమవుతున్న ఓలా ఎలక్ట్రిక్!
X

బెంగళూరు: దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ త్వరలో ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవ్వాలనే లక్ష్యంతో కంపెనీ గోల్డ్‌మన్ శాక్స్, కోటక్ మహీంద్రా బ్యాంకులను ఐపీఓ ప్రక్రియ నిర్వహణ కోసం నియమించుకుంది. ఇతర ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులతో కూడా భాగస్వామ్యం చేసుకోనున్నట్టు తెలుస్తోంది.

గత ఏడాది నిధులను సేకరించే క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లు కలిగి ఉంది. కంపెనీలో ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ పెట్టుబడులు పెట్టాయి. ఈ క్రమంలో మరింత అధిక మార్కెట్ విలువతో ఐపీఓకు రావాలని కంపెనీ భావిస్తోంది. దీన్ని బట్టి కంపెనీ 10 శాతం షేర్లను విక్రయించినప్పటికీ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఓలా ఎలక్ట్రిక్ నిలుస్తుంది.

అయితే, ఓలా ఎలక్ట్రిక్ అనుకున్నంత వేగంగా స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకోవడం, మార్కెటింగ్, లిస్ట్ అవడం వంటి ప్రక్రియలు ఇంత తక్కువ కాలంలో పూర్తవడం కష్టమే. తమ లక్ష్యం ఈ ఏడాది చివరికి లిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు.

Also Read..

జనవరి-మార్చిలో భారీగా తగ్గిన కాంట్రాక్ట్ ఉద్యోగులు!

Advertisement

Next Story

Most Viewed