ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు

by S Gopi |
ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ ఓలా సీఈఓ హేమంత్ భక్షి తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీలో బాధ్యతలు తీసుకున్న 4 నెలలకే ఆయన వైదొలగడం గమనార్హం. ఇదే సమయంలో త్వరలో ఐపీఓ కోసం సిద్ధమవుతున్న ఓలా క్యాబ్స్ 10 శాతానికి సమానమైన ఉద్యోగులను సైతం తొలగిస్తున్నట్టు సమాచారం. పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదివరకు సంస్థ సీఈఓగా ఉన్న వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి సారించేందుకు హేమంత్ భక్షికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది జనవరిలో ఓలా క్యాబ్స్ సీఈఓగా చేరిన హేమంత్ భక్షి కొత్త అవకాశాల కోసం తప్పుకున్నట్టు కంపెనీ చెబుతోంది. తకషణం హేమంత్ రాజీనామా అమల్లో వచ్చిందని, త్వరలో కొత్త సీఈఓను నియమించనున్నట్టు కంపెనీ పేర్కొంది. తొలగింపునకు సంబంధించి సుమారు 200 మంది వరకు ఉద్యోగులపై ప్రభావం ఉండనుంది. ఐపీఓ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పునర్నిర్మాణంలో భాగంగా కంపెనీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed